డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటు పై అఖిలపక్ష సమావేశం

1001220823.jpg

కల్వకుర్తి: పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ, కాంస్య విగ్రహ ఏర్పాటు, అంబేద్కర్ కూడలి అభివృద్ధి అంశాలపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ మాజీ డైరెక్టర్ మబ్బు రామరాజు తెలిపారు.సెప్టెంబర్ 30న ఉదయం 10:30 గంటలకు కల్వకుర్తి యూటీఎఫ్ భవనంలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా, కుల, ఉద్యోగ, మైనారిటీ, విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

You may also like...