శ్రీ అభయ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్న రామ్ చరణ్, వరుణ్ తేజ్
- శ్రీ అభయ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్న రామ్ చరణ్, వరుణ్ తేజ్ - September 29, 2026
- రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కిస్మత్పూర్ విద్యార్థుల ఘన విజయం. - September 28, 2026
- మతసామరస్యానికి ప్రతీక. కోకపెట్ గణేష్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం సోదరుడు. - September 26, 2026

గండిపేట్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హైదరాబాదులోని విల్లా గ్రీన్ గండిపేట్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. హనుమాన్ దీక్షలో ఉన్న వరుణ్ తేజ్ ఆలయానికి రాగా, రామ్ చరణ్ కూడా ఆయనతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసిన మెగా హీరోలకు ఆలయ అర్చకులు మరియు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం అర్చకులు వీరికి వేద ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
