ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..?

జ్ఞాన తెలంగాణ, కొండాపూర్‌: సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలోని సీహెచ్‌ కోనాపూర్‌ మీదుగా సంగారెడ్డి–హైదరాబాద్‌ వైపు నిత్యం రాకపోకలు సాగించే పల్లెవెలుగు బస్సులో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంది. బస్సు పరిమితి 55 మంది కాగా, 100 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు బస్సు మెట్లపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

మహితబ్‌ఖాన్‌గూడ, సీహెచ్‌ కోనాపూర్‌, మాందాపూర్‌, గంగారం, మాచేపల్లి, శివన్నగూడెం, మారేపల్లి, కొండాపూర్‌, తొగరుపల్లి, అలియాబాద్‌, గిర్మాపూర్‌ తదితర గ్రామాల ప్రజలు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని వెంటనే అదనపు బస్సు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌, ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.1412515.jpg

You may also like...