పేద కుటుంబాలకు జూపల్లి భాస్కరరావు..ఫాస్ట్ ఫుడ్ మొబైల్ బండ్లు అందజేత

1001213351.jpg

కల్వకుర్తి, సెప్టెంబర్ 26: కల్వకుర్తి మండలం వేపూర్ గ్రామానికి చెందిన లస్కర్ ఖాజాజీ, యాదగిరి మాధవి కుటుంబాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఫాస్ట్‌ఫుడ్ మొబైల్ బండ్లను అందజేశారు. వెల్దండ మండల సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు ఆర్థిక సహకారంతో ఒక్కొక్కరికి సుమారు రూ.50 వేల విలువైన మొబైల్ బండ్లను అందించారు.కల్వకుర్తి మాజీ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ కృషితో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ పెరుమాళ్ల నాగరాజు, గ్రామ ప్రజలు హన్మంతరావు, తిరుపతిరావు, పి. రాంచంద్రయ్య, ఆ నారయ్య తదితరుల సమక్షంలో లబ్ధిదారులకు బండ్లను అందజేశారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరించిన వారికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...