రిపోర్టర్, నల్గొండ | 7702665844
Latest posts by Gandamalla Kishan
(see all) రోడ్డు ప్రమాదంలో విద్యుత్ లైన్ మెన్ కు తీవ్ర గాయాలు..
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 25 : రోడ్డు ప్రమాదంలో విద్యుత్ లైన్ మెన్ కు తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామశివారులో 65 లో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ కు చెందిన ముక్కామల వెంకన్న దుగినవెల్లి గ్రామంలో విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి తిరిగి కట్టంగూర్ వస్తుండగా మాణిక్యాలమ్మగూడెం క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయాడు. ఆ సయమంలో అదే క్రమంలో వెళ్తున్న మరో కారు వెంకన్న ఢీకొట్టిన కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో వెంకన్నను ఢీకొట్టిన కారు మరో మారు అతనిపై నుంచి వెళ్లింది. ప్రమాదంలో వెంకన్న కాలు విరిగి తలకు, శరీరంపై తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న108 అంబులెన్స్ ఫైలెట్ మహేష్, ఈఎంటీ రాధ ఘటనా స్థలికి వెళ్లి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేసి నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.
