గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

గణేశ్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

వెల్దండ: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సర్పంచ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు శ్రీ సీతారామస్వామి దేవాలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం శ్రీ సాయినగర్ కాలనీలో నిర్వహించిన అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. శ్రీరామ గణేశ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆటపాటల కార్యక్రమాల్లో పాల్గొని, సన్మానం స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.1001208915.jpg

You may also like...