ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం – జూరాల ఆయుకట్ట సాగునీరుతో రైతులకు భరోసా
- ఘనంగా నీలకంఠం పాండు జన్మదిన వేడుకలు - September 25, 2026
- చల్లపల్లిలో బాల భక్త బృందం లడ్డు వేలం – దక్కించుకున్న ఎర్ర జంగయ్య - September 25, 2026
- అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో చిన్న లడ్డు వేలం.. దక్కించుకున్న మనోహర్ - September 25, 2026

వనపర్తి /నాగర్ కర్నూల్: జూరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి లభ్యత, ఆయకట్టు అవసరాలపై చర్చించారు.అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని తెలిపారు. నీటి లభ్యతను బట్టి వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తామని, వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
