ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి అదన కలెక్టర్ – బి చెన్నయ్య
- ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి అదన కలెక్టర్ – బి చెన్నయ్య - September 24, 2026
- మృతురాలి కుటుంబానికి సర్పంచ్ కొండల్ యాదవ్ ఆర్థిక సాయం - September 24, 2026
- గణనాథుల సన్నిధిలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రత్యేక పూజలు - September 24, 2026

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 23: జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య సూచించారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 96,911 మంది ఓటర్లకు హియరింగ్ పూర్తయిందని, మరో 18,700 మంది నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్‌కు హాజరు కావాల్సి ఉందని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన పత్రాలతో హాజరయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.అలాగేమహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్‌ను వివరించారు. అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా ఫారం–18 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
