గణేశుడి లడ్డూ కోసం భక్తుల పోటీ..
- కట్టంగూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలు.. - September 24, 2026
- గణేశుడి లడ్డూ కోసం భక్తుల పోటీ.. - September 24, 2026
- ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యం - September 23, 2026
గణేశుడి లడ్డూ కోసం భక్తుల పోటీ..
రూ.1.76 లక్షలకు దక్కించుకున్న నాగరాజు, లింగమ్మ దంపతులు
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 23: గణనాథుడి లడ్డూ అంటే భక్తులకు ఎంతో ప్రత్యేకం. ఆ లడ్డూను దక్కించుకోవాలనే ఉత్సాహంతో భక్తులు పోటీపడగా చివరకు ఓ దంపతులు అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. కట్టంగూర్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ రాంనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో ఎరుకల నాగరాజు–లింగమ్మ దంపతులు రూ.1.76 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
వేలం పాటలో భక్తుల మధ్య ఉత్కంఠ నెలకొనగా ఒకరిని మించి మరొకరు ధర పెంచుతూ ముందుకు సాగారు. చివరకు ఎరుకల నాగరాజు, లింగమ్మ దంపతులు అత్యధికంగా రూ.1.76 లక్షలు చెల్లించి లడ్డూను సొంతం చేసుకున్నారు. గణనాథుడిపై తమకున్న భక్తికి గుర్తుగా లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు వారిని అభినందించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

