కిస్మత్పూర్ గణేశ లడ్డూను రూ. 3.51 లక్షలకు దక్కించుకున్న మాజీ కార్పొరేటర్ లంకల నిఖిలా సంగారెడ్డి
- కిస్మత్పూర్ గణేశ లడ్డూను రూ. 3.51 లక్షలకు దక్కించుకున్న మాజీ కార్పొరేటర్ లంకల నిఖిలా సంగారెడ్డి - September 23, 2026
- రంజిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాజేందర్ రెడ్డి - September 19, 2026
- చిన్నారుల స్నేహబంధం. ఘనంగా వినాయక చవితి వేడుకలు - September 18, 2026

కిస్మత్పూర్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భాగ్యనగరంలో లడ్డూల వేలం పాటలు హోరాహోరీగా సాగాయి. తాజాగా కిస్మత్పూర్ గణేశ లడ్డూ వేలంలో భారీ ధర పలికింది.కిస్మత్పూర్ గణేశుడి లడ్డూను మాజీ కార్పొరేటర్ లంకల నిఖిలా సంగారెడ్డి రూ. 3,51,000/- (మూడు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు) భారీ మొత్తానికి పాడుకుని సొంతం చేసుకున్నారు.ఈ సందర్భంగా లడ్డూ విజేత లంకల నిఖిలా సంగారెడ్డి కి ఆలయ కమిటీ సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో వారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, వారికి అన్ని విధాలా శుభం కలగాలని ఆలయ కమిటీ మనస్ఫూర్తిగా ఆకాంక్షించింది. ఈ వేలం పాటను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
