నియోజకవర్గ అభివృద్ధికి గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పట్టణ, వార్డు, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై విమర్శలు చేస్తూ, ఆయన డకౌట్ కాలేదని, హిట్ వికెట్ ద్వారా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. తన హయాంలో సుమారు రూ.1,600 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. స్టేషన్ ఘనపూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించామని చెప్పారు. పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు