మారేపల్లి బాబు మృతి పార్టీకి తీరని లోటు
- మూఢనమ్మకంతో సవతి సోదరుడి హత్య.. కేసును ఛేదించిన నర్మెట సర్కిల్ పోలీసులు - November 3, 2026
- జనగామ బీరప్పగడ్డలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ నిమజ్జనం - October 22, 2026
- చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి - October 22, 2026
జఫర్గఢ్ మండలం వడ్డేగూడెం గ్రామానికి చెందిన సీపీఎం, ప్రజా సంఘాల కార్యకర్త మారేపల్లి బాబు ఆదివారం సాయంత్రం మృతి చెందారు. మిల్లు మేస్త్రీగా పనిచేస్తూనే సీపీఎం మండల కమిటీ సభ్యుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సోమవారం ఆయన భౌతికకాయానికి సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు మృతి పార్టీకి, ప్రజా సంఘాలకు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాపర్తి సోమయ్య, కాట సుధాకర్, సాగి నర్సింగ్, బి.చిరంజీవి, ఎం.డి.హలీం, ఎం.డి.పాషా, వెంకటేష్, ఎం.డి.ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
