వినాయకుని సన్నిధిలో ప్రత్యేక పూజలు -గోలి శ్రీనివాస్ రెడ్డి
- వినాయకుని సన్నిధిలో ప్రత్యేక పూజలు -గోలి శ్రీనివాస్ రెడ్డి - September 21, 2026
- పేద కుటుంబానికి సీఎం సహాయనిది అండ – 60 వేల చెక్కు అందజేత - September 21, 2026
- వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు – సిఐ రవీందర్ రెడ్డి - September 21, 2026

ఆమనగల్లు, సెప్టెంబర్ 21: వినాయక చవితి సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని బుద్ధినాథ్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలు, కొబ్బరికాయలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆమనగల్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వినాయకుడిని ప్రార్థించారు. అనంతరం నిర్వాహకులు గోలి శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సయ్యద్ ఖలీల్, కోట శ్రీనివాస్, చుక్క నిరంజన్, సురమల్ల సుభాష్, చందు, కుడుముల శ్రీనివాస్ రెడ్డి, అనంతుల సైదులు, శ్రీశైలం, గుత్తి బాలస్వామి, రాములు, నిర్వాహకులు సతీష్, కిరణ్, బుజ్జి, చింటు, గణేష్, కార్తిక్, భరత్, వస్పుల కృష్ణ, శివతో పాటు కార్యకర్తలు, యువకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
