బొల్లంపల్లి లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం – జెండా ఆవిష్కరించిన సర్పంచ్ ప్రసాద్ గౌడ్
- వెల్దండకు వెలుగులు – 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్ - September 19, 2026
- కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి - September 19, 2026
- బాలల బంగారు భవిష్యత్తుకు పోషకాహారమే పునాది – వెల్దండలో సమన్వయ సమావేశం - September 19, 2026

వెల్దండ సెప్టెంబర్ 17: వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జాతీయ జెండా ప్రతీకగా నిలుస్తుందని, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రజా పాలన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ,మాజీ ఎంపీటీసీ చల్లా వెంకట్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ,నాయకులు బ్రహ్మచారి,ఆలంపల్లి కృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ గీతం ఆలపిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు.
