గణేష్ మండపాలకు డీజే నిషేధం – నిబంధనలు పాటించాలి: సిఐ రఘువీర్ రెడ్డి
- వెల్దండ సింగిల్ విండో కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ: రాజేందర్ రెడ్డి - September 17, 2026
- మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత – కానుగుల జోగయ్య - September 17, 2026
- పోతేపల్లి గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సర్పంచ్ కొండల్ యాదవ్ రూ. 10 వేల విరాళం - September 17, 2026
వెల్దండ సెప్టెంబర్ 
16 : గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని వెల్దండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రఘు వీర్ రెడ్డి సూచించారు. డీజే సౌండ్‌కు అనుమతి లేదని, మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు పరిమిత శబ్దంతో వాడాలని, విద్యుత్ వైరింగ్ సురక్షితంగా ఉండాలని, మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొనరాదని, ఇతర మతాలను కించపరిచే బ్యానర్లు పెట్టరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, నిమజ్జన సమయంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే పోలీస్ డయల్ 112 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.భక్తితో గణేష్ ఉత్సవాలు చేసుకుని బాధ్యత పాటిద్దాం అని పిలుపునిచ్చారు.
