పర్యవేక్షక ఇంజనీర్ నరసింహారెడ్డిని కలిసిన పుట్ట రాంరెడ్డి
- వెల్దండ సింగిల్ విండో కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ: రాజేందర్ రెడ్డి - September 17, 2026
- మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత – కానుగుల జోగయ్య - September 17, 2026
- పోతేపల్లి గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సర్పంచ్ కొండల్ యాదవ్ రూ. 10 వేల విరాళం - September 17, 2026

నాగర్ కర్నూల్ / వెల్దండ 16: నాగర్ కర్నూల్ జిల్లా విద్యుత్ పర్యవేక్షక ఇంజనీర్ (SE) నరసింహారెడ్డిని వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుట్టా రాంరెడ్డి బుధవారం నాగర్ కర్నూల్ విద్యుత్ కార్యాలయంలో బొల్లంపల్లి గ్రామ రైతులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండలంలో విద్యుత్ సరఫరాలో కోతలు విధించకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని పర్యవేక్షక ఇంజనీర్ ని కోరారు.కొన్ని మరమ్మతుల కారణంగా అంతరాయం ఏర్పడుతున్న మాట వాస్తవమేనని, రైతులకు సరిపడా విద్యుత్ అందించే విధంగా కృషి చేస్తామని (SE)తెలిపారు. రైతులందరూ సకాలంలో డీడీలు, విద్యుత్ బకాయిలు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన సూచించారు.కార్యక్రమంలో రైతులు చల్లా రాంరెడ్డి, జక్కుల శ్రీశైలం, ఈదులపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
