వర్షాకాలంలో మరింత అవస్థలు.. వాహనాలు, ఎడ్లబండ్లకు దారేది

సిర్పూర్‌(టి): మండలంలోని పారిగాం గ్రామం నుంచి ప్రాణహిత నదికి వెళ్లే దారి వర్షాలతో బురదమయంగా మారింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో రైతుల పొలాలు ఉండటంతో వ్యవసాయ పనుల కోసం నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో బురద కారణంగా వాహనాలు, ఎడ్లబండ్లు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంటోందన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఫామ్ రోడ్డు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.

You may also like...