రూ. 3400 కోట్ల ఎమ్మెల్యే: ముంబై వీధుల్లో బిచ్చగాడిగా మారిన పరాగ్ షా
- 122 డివిజన్ బండ్లగూడలో గణనాథుడిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఇన్చార్జ్ కార్తీక్ రెడ్డి. - September 15, 2026
- రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గంగని హరికృష్ణ నియామకం - September 15, 2026
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ - September 15, 2026

మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన చర్చనీయాంశంగా మారింది. రూ.3,400 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న రాష్ట్రంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యే ఒకరోజు సాధారణ బిచ్చగాడిగా మారారు. అంతేకాదు.. రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసి, ఆ భిక్షతోనే భోజనం చేశారు. ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు, సంపద మరియు అధికార అహంకారాన్ని వీడటానికే ఆయన ఈ వినూత్న ప్రయోగం చేశారు. ఎవరూ గుర్తుపట్టకుండా చిరిగిన బట్టలు, ప్రత్యేక మేకప్‌తో ఘాట్కోపర్ వీధుల్లో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ఆయనకు డబ్బులు, ఆహారం ఇవ్వగా, ఆయన సొంత అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా గుర్తుపట్టలేక అక్కడి నుండి వెళ్ళిపోమని గద్దించాడు. మానవత్వాన్ని, సామాన్యుల కష్టాలను ప్రాక్టికల్‌గా తెలుసుకోవడానికే తాను ఇలా చేసినట్లు ఎమ్మెల్యే పరాగ్ షా పేర్కొన్నారు.
