ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి, సీఈఓ సుదర్శన్‌రెడ్డి
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న హియరింగ్ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. రాజేంద్రనగర్ ఏఈఆర్ఓ పరిధిలోని బండ్లగూడ జాగీర్ గ్రామ పంచాయతీ, హైదర్షాకోట్ జెడ్పీహెచ్ఎస్, మరియు శివరాంపల్లి హియరింగ్ కేంద్రాలను ఆయన క్షుణ్ణంగా సందర్శించారు.ఈ సందర్భంగా కేంద్రాల్లో ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులు, సహాయక పత్రాలు (డాక్యుమెంటేషన్) మరియు క్లెయిమ్‌ల పరిశీలన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ), రాజేంద్రనగర్ ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు మరియు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
