గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేకు వినతి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి :
అజిలాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్న సర్పంచ్ సిద్దగోని రమేష్ గౌడ్ అభివృద్ధి పనుల కోసం శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని తన వాసంలో కలసి గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.సిసి రోడ్లు,అంతర్గత మురుగు కాలువలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు,అంగన్వాడి భవనం, మహిళా సమైక్య భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామాల అభివృద్ధి సహకరిస్తానని, పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడం తన ధ్యేయమని అన్నారు. సర్పంచ్ వెంట మాజీ ఉప సర్పంచ్ కరుణాకర్ రెడ్డి,ఉప సర్పంచ్ గణేష్ గౌడ్, వార్డు సభ్యులు శేఖర్,కాలె వెంకటేష్ కురుమ తదితరులు ఉన్నారు.

You may also like...