నీట్‌కు గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు ఆహ్వానం
- “విజయం ఒక్కరోజులో రాదు.. పట్టుదలతో సాగిన ప్రతి అడుగూ విజయానికి పునాది.” - September 22, 2026
- స్వర్ణ సంచలనం..లంకపై భారత్ ఘన విజయం! - September 22, 2026
- రిమ్స్ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం - September 22, 2026

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 8:
తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGTWREIS) ఆధ్వర్యంలో 2026లో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులై, నీట్ పరీక్షలో 200కుపైగా మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులకు ఉచిత నీట్ శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది. అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో (TGTWRDC) మొదటి సంవత్సరం ప్రవేశం పొందాల్సి ఉంటుందని తెలిపింది.
దరఖాస్తుదారులు టీసీ, 10వ తరగతి మార్కుల మెమో, ఇంటర్ మార్కుల మెమో, 12వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, అన్ని ధ్రువీకరణ పత్రాల రెండు జిరాక్స్ సెట్లతో కలిసి ఆగస్టు 15, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులను హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని TGTWREIS కార్యాలయం, బాలురకు సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్లలోని TGWRDC (Men), బాలికలకు హయత్‌నగర్ కుంట్లూరులోని TGTWR COE (PVTG-G) కేంద్రాల్లో స్వీకరిస్తారు.
