8వ వార్డులో కాంగ్రెస్ టికెట్‌కు కృతజ్ఞతలు తెలిపిన ధర్మన్న గారి అనురాధ వెంకట్ రెడ్డి


జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి:

శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఫామ్ అందించి తనపై విశ్వాసం ఉంచిన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, మున్సిపాలిటీ స్థాయి నాయకత్వానికి ధర్మన్న గారి అనురాధ వెంకట్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల తన నిబద్ధతను గుర్తించి ఈ కీలక బాధ్యత అప్పగించిన నాయకత్వానికి వినయపూర్వక అభివాదం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు
అలాగే మండల, మున్సిపాలిటీ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందించిన ప్రోత్సాహం తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని మాటలతో కాకుండా, ప్రజల సేవ ద్వారా మరియు ఎన్నికల గెలుపుతో నిరూపిస్తానని ధర్మన్న గారి అనురాధ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పనిచేస్తానని, పార్టీ విధానాలు, ప్రజాహిత కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లే బాధ్యతను స్వీకరిస్తానని చెప్పారు. 8వ వార్డు సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం, పారదర్శక పాలన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల తన ప్రధాన కార్యాచరణలో భాగమని వెల్లడించారు.
గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేసినప్పుడే ఆశించిన విజయం సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించి, కాంగ్రెస్ పార్టీకి బలమైన విజయాన్ని అందించాలని ప్రజలకు ధర్మన్న గారి అనురాధ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల ఆశీర్వాదాలతో 8వ వార్డును అభివృద్ధికి ఆదర్శంగా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

You may also like...

Translate »