రేపు శంకరపల్లిలో బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సబితా ఇంద్రారెడ్డి

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :
మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు, మాజీ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి రేపు (మంగళవారం) చేవెళ్ల నియోజకవర్గం, శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొననున్నారు కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం 7:30 గంటలకు శంకరపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు, పల్లె శంకరపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున నిర్వహించనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అనంతరం ఉదయం 8:30 గంటలకు 7వ వార్డు, రామంతపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమాల సందర్భంగా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడంతో పాటు, స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
కావున ఈ కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
