కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణ

కట్టంగూర్, సెప్టెంబర్ 11: మండల నూతన విద్యాధికారిగా మైనం శ్రీలత శుక్రవారం ఎంఆర్సీ భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎంఈఓగా విధులు నిర్వహించిన అంబటి అంజయ్య వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, ఆయన స్థానంలో పామనగుండ్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైనం శ్రీలతను ఎంఈఓగా నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీలత మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అంబటి అంజయ్య, ప్రధానోపాధ్యాయులు బద్రీనారాయణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.1000341687.jpg

You may also like...