అవయవదానం తో మానవత్వం చాటుకున్న పోలీస్ కుటుంబం
ఉద్యోగి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) విభాగంలో ఆర్మ్డ్ రిజర్వ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈ. నర్సింహ (57) తీవ్ర అనారోగ్యంతో బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించబడ్డారు. భర్త పరిస్థితి విషమించడంతో ఆయన భార్య ఈ. లక్ష్మి అవయవదానానికి అంగీకరించి మానవతను చాటుకున్నారు.మహబూబ్‌నగర్ జిల్లా కోడూరు గ్రామానికి చెందిన నర్సింహ కొంతకాలంగా తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతూ నాలుగు విడతలుగా డయాలసిస్ చేయించుకున్నారు. ఈ నెల 3వ తేదీన తీవ్ర…
