జిహెచ్ఎంసి నీ సందర్శించిన థాయిలాండ్ బృందం

హైదరాబాద్, నవంబర్ 12: పట్టణ పాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు థాయ్‌లాండ్‌కు చెందిన ప్రతినిధుల బృందం నవంబర్ 11న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కార్యాలయాన్ని సందర్శించింది.థాయ్ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతకు సలహాదారుగా పనిచేస్తున్న పెంగ్‌పనోర్ బూన్‌క్లమ్, ప్రోగ్రెసివ్ మూవ్‌మెంట్ ఫౌండేషన్ చైర్మన్ తనథోర్న్ జువాంగ్‌రూంగ్‌కిట్, ఫౌండేషన్ డైరెక్టర్ కుంతిడా రుంగ్రూంగ్‌కియాట్, సాయిరామ్ ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ…