విడాకుల ప్రచారానికి రమ్యకృష్ణ చెక్‌!

హైదరాబాద్: సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అగ్రనటి రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితంపై కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విడాకుల ప్రచారానికి తెరదించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో ఆమె వైవాహిక బంధం ముగిసిందంటూ సాగుతున్న ఊహాగానాలను ఖండిస్తూ, తామిద్దరం ఇప్పటికీ చట్టపరంగా, మనస్ఫూర్తిగా భార్యాభర్తలుగానే...