అత్వెల్లి ఛత్ పూజ మహోత్సవంలో.. ఎంపీ ఈటల రాజేందర్

మేడ్చల్ మండలం అత్వెల్లి చెరువు వద్ద జన సేవ సంఘ్ ఛత్ పూజ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్ పూజ మహోత్సవంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యభగవానుడు, ఛటీ మైయాకు భక్తులు కృతజ్ఞతలు తెలిపే ఈ ప్రాచీన పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసే ఇటువంటి వేడుకలు సామాజిక సమైక్యతను పెంపొందిస్తాయని…