ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తలకొండపల్లి మండలం విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సెప్టెంబర్ 29న ఉదయం 11:45 నిమిషాలకు దేవకి గార్డెన్ లో నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమానికి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించనున్నారని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు,విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,విద్యాభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
