ఆలయ నిర్మాణానికి గోలి శ్రీనివాసరెడ్డి రూ.20 వేల విరాళం.!

1001364375.jpg

చారగొండ,నవంబర్ 15: నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి రూ.20 వేల విరాళం అందజేశారు.ఈనెల 19న నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దండ మాజీ ఎంపీపీ,మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి చేతుల మీదుగా ఈ విరాళాన్ని అందించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల చదువుకు, ఇల్లు లేని పేదలకు గృహ నిర్మాణానికి, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొజ్జయ్య, యువ నాయకులు పోలే అశోక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...