చిన్నారులతో బాలల దినోత్సవ వేడుకలు

మూసాపేట్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ సలీం తన మిత్రబృందంతో కలిసి జనతానగర్ బస్తీలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. చిన్నారుల చిరునవ్వులే రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకాలని సలీం పేర్కొన్నారు. బాలల హక్కులు, సంతోషం, ఆరోగ్యకరమైన బాల్యం సమాజ బాధ్యతని ఈ సందర్భంగా తెలిపారు. చిన్నారులతో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆనందం పంచుకున్నారు.

You may also like...