పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ భరోసా

షాపూర్ నగర్: అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం షాపూర్ నగర్‌లోని తన నివాసంలో ఏడుగురు బాధిత కుటుంబాలకు మొత్తం రూ.4.20 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like...