నీటిపారుదల డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు – రూ.100 కోట్ల అక్రమాస్తులు.!

1001354215.jpg

నాగర్ కర్నూల్ నవంబర్ 12 :నాగర్‌కర్నూల్ జిల్లాలో నీటిపారుదల శాఖ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు భారీ దాడులు చేశారు.ఆయనపై కేసు నమోదు చేసి ఒకేసారి రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లోని బైరమల్‌గూడ మాధవరం సరే నీటి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఆయన నివాసంతో పాటు ఇతర చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ చలపతి వెల్లడించారు.తనిఖీల్లో 25 ఎకరాల భూమి, పలు చోట్ల ఇళ్ల స్థలాలు, 50 తులాల బంగారం,4 ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ భారీగా ఉంటుందని, పూర్తి వివరాలు తనిఖీ అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.ఒక డీఈఈ స్థాయి అధికారి వద్ద ఇంత భారీ స్థాయిలో ఆస్తులు బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

You may also like...