నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి. నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి
- నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి. నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి - November 12, 2026
- రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక - November 11, 2026
- కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజులామాధవరెడ్డి - November 11, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 12: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరవేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమంలో భాగంగా గురువారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి సతీష్ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భావితరాలకు నీటి వనరులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఆరుతడి పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని, ఆయిల్‌పామ్ సాగు, సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి వివరించాలని కోరారు. గ్రామాల్లో విద్యుత్ వృథాను అరికట్టేందుకు విద్యుత్ స్తంభాలకు ఆన్–ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేసుకోవాలని, పశువుల తొట్టెలు నిర్మించి పశువులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సమావేశంలో చదివి వినిపించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో గంట అంజన్ రెడ్డి, తహసీల్దార్ పుష్పలత, ఏవో గిరిప్రసాద్, ఏపీఓ కడెం రామ్మోహన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిరీష, ఏపీఎం నరహరి, హౌసింగ్ ఏఈ అరుణ, ట్రాన్స కో ఏఈ హుస్సేన్, ఐసీడీఎస్ సీడీపీవో అస్రా అంజుమ్, ఐబీ ఏఈ రాజశేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజు, ఎంఈఓ అంబటి అంజయ్య, సర్పంచ్ లు దార సత్తెమ్మ, ఎన్న మౌనిక, తోటకూరి జలజ, వల్లపు శ్రీనివాస్ రెడ్డి, తేలు సత్తయ్య, కురిమిళ్ల మల్లేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
