సొంతింటి కల నెరవేర్చడమే రేవంత్ సర్కార్ లక్ష్యం:

  • మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ బుధవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, స్థానికంగా నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి కూడు, గూడు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో బోడుప్పల్ మాజీ అధ్యక్షుడు పోగుల నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బొమ్మకు కళ్యాణ్, కొత్త కిషోర్ గౌడ్, జె. రాములు, గుర్రాల వెంకటేష్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, చీరాల నరసింహ, దానగల యాదగిరి, వెంకటేష్ గుప్త, బొమ్మ రమేష్, లోకేష్, హరినాథ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

You may also like...