ఉస్మానియా ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఎంపీ ఈటల రాజేందర్

 విశ్వవిద్యాలయ నాన్‌ టీచింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మెకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మెలో పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆకలితో ఉన్నవారితో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, టైమ్‌స్కేల్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.1,700 వేతన పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఈపీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. ఖాళీలు ఉన్నప్పటికీ అర్హులకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యం పేదల బతుకులు బాగుపడటమేనని గుర్తుచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ వైభవాన్ని కాపాడాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై వైస్‌ ఛాన్సలర్ తక్షణమే స్పందించి చర్చలు జరపాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తాను, భారతీయ జనతా పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

You may also like...