నాచారంలో ఘోర రోడ్డు ప్రమాదం..

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: నగరంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతంలో కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఢీకొన్న తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాచారం పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక డ్రైవర్‌ నిర్లక్ష్యమా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

You may also like...