పొద్దటూరులో ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశం
- మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి! - November 10, 2026
- అక్షర్ పటేల్‌కు చెన్నై గాలం.. - November 10, 2026
- మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు.. - November 10, 2026

- పిఏసిఎస్ ఛైర్మెన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం వెంకట్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం..
- 3వ వార్డులో 15 ఇళ్ల మంజూరుకు చాకలి రాములు కృషి
శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దటూరు గ్రామంలోని 3వ వార్డుకు చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన సందపేట నరేష్–మమత దంపతులు నేడు తమ నూతన గృహంలో గృహప్రవేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 3వ వార్డు మాజీ సభ్యుడు చాకలి రాములు మాట్లాడుతూ.. తాను వార్డు సభ్యుడిగా పనిచేసిన సమయంలో వార్డులోని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేందుకు ప్రత్యేకంగా కృషి చేసినట్లు తెలిపారు. అప్పటి మాజీ వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి సహకారంతో తన హయాంలో 3వ వార్డుకు 15 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేసినట్లు గుర్తుచేశారు.
పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడంలో మాజీ వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి అందించిన సహకారం మరువలేనిదని చాకలి రాములు పేర్కొన్నారు. తాను వార్డు సభ్యుడిగా ఉన్న సమయంలో చేసిన కృషి ఫలితంగా నేడు పేద కుటుంబాలు సొంతింటి కలను నెరవేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సందపేట నరేష్–మమత దంపతులు నూతన గృహంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రస్తుత శంకర్పల్లి పిఏసిఎస్ డైరెక్టర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బండ లక్ష్మీ నర్సింహా, ఉప సర్పంచ్ కవేలి గోవర్ధన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ కె. శ్రీనివాస్, రజక సంఘం అధ్యక్షుడు చాకలి మహేందర్, 3వ వార్డు మాజీ సభ్యుడు చాకలి రాములు, మాజీ వార్డు సభ్యులు దర్ని కృష్ణ, ల్యాగల హన్మంత్, పట్నం రాజిరెడ్డి, సీనియర్ నాయకులు కొండకల్ల విష్ణువర్ధన్ రెడ్డి, నవీన్ కుమార్, యాదయ్య, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్, రామ్ రెడ్డి, రాజు, వెంకటేశ్, సత్యనారాయణ రెడ్డి, విలేజ్ సెక్రటరీ శ్రీనివాస్, కరోబర్ ఎల్. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
