ఇర్విన్-ఆమనగల్లు డబుల్ రోడ్డుకు నిధులు ఇవ్వండి – కేంద్ర మంత్రికి ఆచారి వినతి

1001338457.jpg

మాడ్గుల:మాడ్గుల మండలం ఇర్విన్ నుంచి కలకొండ, చంద్రాయన్ పల్లి, మాల్లేపల్లి గ్రామాల మీదుగా ఆమనగల్లు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని కోరారు.ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇర్విన్ – ఆమనగల్లు మధ్య డబుల్ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ప్రజల ప్రాణ భద్రత, ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ రహదారిని డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దండు శ్రీను, మట్టా వెంకటేష్,రాం కిషన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...