కలం మిత్రుల అభినందన..! చైర్మన్ భూపతి రెడ్డికి పాత్రికేయుల ఘన సన్మానం..!
- కలం మిత్రుల అభినందన..! చైర్మన్ భూపతి రెడ్డికి పాత్రికేయుల ఘన సన్మానం..! - November 7, 2026
- ఆమనగల్లులో 70వ ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన..తల్లోజు ఆచారి - November 7, 2026
- కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిని సన్మానించిన విజేందర్ యాదవ్ - November 7, 2026

వెల్దండ నవంబర్ 07 :వెల్దండ మండలం సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికైన యెన్నం భూపతి రెడ్డిని పాత్రికేయ మిత్రులు శనివారం ఘనంగా సన్మానించారు.శాంపూరి శ్రీనివాస్,దండు జగన్, రామాంజనేయులు తదితర పాత్రికేయ మిత్రులు పాల్గొని చైర్మన్ భూపతి రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ భూపతి రెడ్డి మాట్లాడుతూ.. నమ్మకంతో చైర్మన్ గా ఎన్నుకున్న పెద్దలకు, అభినందనలు తెలిపిన పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రైతులే నా ప్రాధాన్యత.సింగిల్ విండో ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు,మందులు అందేలా చూస్తా రైతు సంక్షేమమే తన లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.
