కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా ధన్వంతరి భగవాన్ జయంతి వేడుకలు
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
- తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - November 6, 2026
- తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - November 6, 2026
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నేడు శ్రీ ధన్వంతరి భగవాన్ జయంతి వేడుకలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంలు ముఖ్య అతిథులుగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. పురోహితులు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 250 మందికి శ్రీనివాస్ అన్నదానం ఏర్పాటు చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సీహెచ్ రాజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ మానేటి, కార్యదర్శి ఎల్. దేవయ్య, ఉపాధ్యక్షులు తుమ్మ శంకర్, కామారెడ్డి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. బా. ప్రకాష్, శ్రీనివాస్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 175 మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.
