తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
- తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - November 6, 2026
- తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - November 6, 2026
తాడ్వాయి: VBG RAM G పథకంలో భాగంగా ప్రతి 40 మంది కూలీలకు ఒక మేటును నియమించాలనే ప్రభుత్వ నిబంధనల మేరకు తాడ్వాయి మండల కేంద్రంలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. MPDO భరత్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో మేట్లకు VBG RAM G పనులకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పనుల కొలతలు తీసుకునే విధానం, డిమాండ్ వర్క్స్ నమోదు, జాబ్ కార్డుల అప్డేట్, కొత్త జాబ్ కార్డులలో పేర్ల నమోదు, కూలీల హాజరు నమోదు, NMMS (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా ఫోటో క్యాప్చర్ చేసి హాజరు నమోదు చేసే విధానం గురించి వివరించారు. అలాగే ఫారం పాండ్ పనులు, ఫార్మేషన్ రోడ్లు, స్టాగర్డ్ ట్రెంచెస్, కమ్యూనిటీ సోక్ పిట్స్, బోర్వెల్ రీచార్జ్ వంటి వివిధ అభివృద్ధి పనులను చేపట్టే విధానం, వాటి నిర్వహణలో మేట్ల బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేటు చొప్పున డిమాండ్ నమోదు చేయడంతో పాటు, పనుల ప్రదేశంలో NMMS యాప్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ తిరుపతి, టెక్నికల్ అసిస్టెంట్లు కృష్ణ గౌడ్, రాజు, కైలాష్, ఫీల్డ్ అసిస్టెంట్లు సంతోష్, శంకర్, సంజీవులు, సాయన్న, బాలరాజుతో పాటు మండలంలోని పలువురు మేట్లు పాల్గొన్నారు.
