అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలి.. డీఈఓను సస్పెండ్ చేయాలి
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
- తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - November 6, 2026
- తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - November 6, 2026
కామారెడ్డి, నవంబర్ 6: జిల్లాలో విద్యాశాఖలో కొనసాగుతున్న అక్రమ డిప్యూటేషన్లపై సమగ్ర విచారణ జరిపి, వాటిని తక్షణమే రద్దు చేయాలని AISA రాష్ట్ర కో-కన్వీనర్ జీవియం విఠల్ డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లించి స్థానిక పాఠశాలల్లో డిప్యూటేషన్లు పొందుతున్న ఉపాధ్యాయుల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సిబ్బంది అధికారులుగా చలామణి అవుతున్నారని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నారాయణ, చైతన్య పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందించి డీఈఓను సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో కలెక్టరేట్, విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పేరుమడ్ల బుల్లెట్, రోహిత్, లింగం, గడ్డం రవీందర్, సంప్రీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
