కామారెడ్డిలో ILPA రాష్ట్ర మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

ఇండియన్ లీగల్ ప్రొఫెషన్ అసోసియేషన్ (ILPA) 6వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి!

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషన్ అసోసియేషన్ (ILPA) ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన వరంగల్‌లో నిర్వహించనున్న 6వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ILPA నాయకులు అడ్వకేట్ సిద్ధిరాములు గారు, BAMCEF రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్ గారు, భారతీయ విద్యార్థి మోర్చా (BVM) రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. న్యాయవాదుల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం, న్యాయవ్యవస్థలో సమాన అవకాశాల సాధన కోసం న్యాయవాదులంతా ఐక్యంగా ముందుకు సాగాలని వారు కోరారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించడంతో పాటు, వృత్తిపరమైన అభివృద్ధి, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ, న్యాయవాదుల సంక్షేమం కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే వేదికగా ఈ రాష్ట్ర మహాసభలు నిలవనున్నాయని తెలిపారు. “Black Coats for Blue Revolution” అనే నినాదంతో బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ILPA నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థుల్లో అంబేద్కర్ భావజాలం, రాజ్యాంగ స్ఫూర్తి, సామాజిక న్యాయం పట్ల అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచడంలో ILPA కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే వరంగల్ నగరంలో 6వ ILPA రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభల ద్వారా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు, సమానత్వంతో కూడిన న్యాయవ్యవస్థ నిర్మాణానికి సమిష్టి కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ILPA 6వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రవి, BVM నాయకులు మనోజ్, కామారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...