ఆర్టీసీ కార్మికులకు అవమానం

386883.jpg

సిద్దిపేట:తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరేందుకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులకు సిద్దిపేట డిపోలో తీవ్ర అవమానం ఎదురైంది. సమస్యలపై చర్చించేందుకు వెళ్లిన జేఏసీ (JAC) నాయకులు, కార్మికులతో సిద్దిపేట డిపో మేనేజర్ (DM) వ్యవహరించిన తీరు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.

కుర్చీలు లేవు.. గౌరవం లేదు.

డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాట్లాడేందుకు జేఏసీ ప్రతినిధుల బృందం డిపో మేనేజర్ కార్యాలయానికి వెళ్లింది. అయితే అధికారుల హోదాలో ఉన్న సదరు డిపో మేనేజర్, వచ్చిన కార్మికులను కనీసం కుర్చీలపై కూర్చోమని కూడా చెప్పలేదు. కూర్చోవడానికి కుర్చీలు ఇవ్వకపోవడంతో, చేసేదేమీ లేక జేఏసీ నాయకులు, కార్మికులు డిపో మేనేజర్ టేబుల్ ముందే కింద నేలపై కూర్చోవలసి వచ్చింది. అలా కింద కూర్చునే వారు తమ బాధలను, సమస్యలను అధికారికి వివరించారు.

రాత్రింబవళ్లు కష్టపడి ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తున్న కార్మికులను ఇలా కించపరచడం కరెక్ట్ కాదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిపో మేనేజర్ అహంకారపూరిత వైఖరిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు

You may also like...