కీసర ఓఆర్ఆర్పై రక్తపుటేర్లు.. టైర్ పేలి ఆటో బోల్తా
- రౌండ్-16లోకి దూసుకెళ్లిన సింధు
- September 26, 2026 - రాత్రి అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా? - September 26, 2026
- కాచిగూడలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి - September 26, 2026

మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 26: కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. కీసర నుంచి శామీర్పేట్ వైపు కూలీలతో వెళ్తున్న ఆటో టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మహారాష్ట్రకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. టైర్పేలడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంతో ఓఆర్ఆర్పై కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
