గణేశుని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి – మహా అన్నదానం నిర్వహించిన కోళ్ల సాయికుమార్ గౌడ్

రఘునాథపల్లి లో గణేశుని ఆశీస్సులతో ప్రజలందరూIMG-20260923-WA0792.jpg

సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండి మేలు జరగాలని మాజీ ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్ ఆకాంక్షించారు.రఘునాథపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలోని బ్యాంక్ స్ట్రీట్ వద్ద బుధవారం యువ నాయకుడు కోళ్ల సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గణేశునికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు మహా అన్నదానం చేశారు.ఈ సందర్భంగా మేకల వరలక్ష్మి నరేందర్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రజలంతా స్నేహభావంతో ఐక్యంగా మెలగాలని ఆకాంక్షించారు. మహా అన్నదానం నిర్వహించిన కోళ్ల సాయికుమార్ గౌడ్‌ను అభినందించారు.కార్యక్రమంలో యువ నాయకులు బొల్లం రంజిత్, బొల్లం రాజీవ్, గందె ప్రదీప్ కుమార్, పూజారి పిండిపోలు శ్రీనివాస్ శర్మ, మల్కాపురం అన్వేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పేర్ని ఉషా రవి, బత్తోజు నరసింహాచారి, సీనియర్ జర్నలిస్టులు ఆకుల మహేష్, కొన్నే సతీష్, ఇమ్మడిశెట్టి శివరాం, కరిమికొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like...