వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు – సిఐ రవీందర్ రెడ్డి
- వినాయకుని సన్నిధిలో ప్రత్యేక పూజలు -గోలి శ్రీనివాస్ రెడ్డి - September 21, 2026
- పేద కుటుంబానికి సీఎం సహాయనిది అండ – 60 వేల చెక్కు అందజేత - September 21, 2026
- వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు – సిఐ రవీందర్ రెడ్డి - September 21, 2026

వెల్దండ: గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేదని వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వెల్దండ పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.డీజేల నుంచి వెలువడే అధిక శబ్దం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, హృదయ స్పందనలో మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలను భజనలు, కోలాట పాటలు, డప్పు వాయిద్యాలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీలకు సూచించారు.ఈ సమావేశంలో ఎస్సైలు యుగేందర్ రెడ్డి, మాధవరెడ్డి, వీరబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
