ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

1001284845.jpg

నాగర్‌కర్నూల్ జిల్లా: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ,ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి,కూచుకూళ్ళ రాజేష్ రెడ్డి, రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్, సీనియర్ నాయకులు కెవిఎన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

You may also like...