శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి/శంషాబాద్, సెప్టెంబర్ 19:
శంషాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగంగా ప్రయాణిస్తుండగా అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఢీకొన్న తీవ్రతకు కారు భారీగా దెబ్బతినడంతో అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, నలుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. మృతులను మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన కేతావత్ లింబ్య, జమున, కేతావత్ మానసింగ్, కేతావత్ వాస్రామ్‌గా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో చౌడూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అతివేగం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంద
